పంతువరాళి - రూపక |
పల్లవి: |
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ.. |
అను పల్లవి: |
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస? కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ.. |
చరణము(లు): |
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ.. |
శాపకారణము నహల్య చాపరాతి చందమాయె పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ.. |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి