1, నవంబర్ 2024, శుక్రవారం

ఆదివారం మరియు రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా!


 ఆదివారం మరియు రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా!

పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే... అది అంతే అనేవారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చేవారు కాదు. వారికి కూడా వివరం తెలియకపోయినాసరే తమ తల్లితండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు. కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదు అనే సందేహం మాత్రం చాలామందికి ఉంటుంది. అందుకే ఆ నియమంలో దాగివున్న అర్ధాన్ని తెలుసుకుందాం... ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరికాయని ఎందుకు తాకకూడదు అంటే... ఉసిరికాయలో పుష్కలంగా 'సి' విటమిన్ ఉంటుంది. ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. అంతేకాదు, రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడతాము. అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు. ఉసిరికాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంటుంది. సూర్యుడు రోజైన ఆదివారంనాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. అందుకే ఆదివారంనాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు. (ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉసిరి ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు) ఇది సైన్స్ తో కూడిన దివ్యరహస్యం. ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి...
భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్ ఆదివారంనాడు రాత్రింబగళ్ళు, సప్తమినాడు పగటిపూట ఉసిరికాయ పచ్చడిని తిన్నచో అలక్ష్మీకలుగును. కనుక నిషేధము. పై శ్లోకం ప్రకారం నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే వీర్యహాని, యశోహాని, ప్రజ్ఞాహాని కూడా పొందుతారు

11, అక్టోబర్ 2024, శుక్రవారం

అమ్మలఁ గన్నయమ్మ.. -తాత్పర్యం


 అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... . . . భా-1-10-ఉ.- బమ్మెర పోతన



తాత్పర్యం
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

2, అక్టోబర్ 2024, బుధవారం

దీపావళి పండుగ పరమార్ధం


 

దీపావళి పండుగ పరమార్ధం

మన దేశంలో అనాదిగా ఆ సేతుహిమాచలం పెద్దలూ పిల్లలూ అనందోత్సాహాలతో జరుపుకొనేపండుగ దీపావళి. చీకటి లోనుండి వెలుగులోనికి, అగ్నానమునుండి గ్నానము వైపు మన జీవన ప్రయాణపు గమ్యం ఉండాలనేదే దీపావళి పండుగ పరమార్ధం.

దీపావళి అంటే దీపముల వరుస అని అర్దం.

దీపావళి పండుగను పూర్వం అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీకశుద్ద విదియవరకు ఐదురోజులు జరుపుకొనేవారు. ఇప్పటికీ ఉత్తరభారతదేశంలో ఐదు రోజులుగా, దక్షిణభారతదేశం లో మూడురోజులుగా జరుపుకొంటున్నాము

త్రయోదశి నాడు రాత్రి అపమృత్యు నివారణకోసం దీపాలువెలిగించి ఇంటిముందు ఉంచాలి. చతుర్దశి రోజున నూనెయందు లక్ష్మి , నీటియందు గంగాఉంటాయి కాబట్టి వంటికినూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి అనంతరం నూతన వస్త్రధారణ చెయాలి. ఇక అమావాస్య రోజు వివిధ రకాలపిండి వంటలూ, మిఠాయిలూ, పంచభక్ష్య పరమాణ్ణాలతోభుజించి సాయంత్రంలక్ష్మీపూజచేసి ఇంటిని దీపాలతో అలంకరించాలి. తరువాత టపాకాయలు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లుతోవచ్చే సందడి వాతావరణం అందరికి తెలిసిందే.

దీపావళి ఇతిహాసం

పురాణ గాధ ప్రకారం వరాహవతారంలొ విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినవాడు నరకాసురుడు. ఈ నరకాశురుడు బ్రహ్మవలన వరాలు పొంది దేవ మానవులను పీడించేవాడు. ఇతని బాధలు తాళలేక ఇంద్రుడు కృష్ణునికి మొరపెట్టుకోంటే సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసురిని సంహరించిన రోజే నరకచతుర్ధి గా మనం జరుపుకొంటున్నాము. భూదేవి నరకుడు తన కొడుకైనప్పటికి అతని మరణంవల్ల లోకకళ్యాణం జరిగినందుకు సంతోషించి నరకుడు మరణించినరొజును నరక చతుర్దశిగా మానవులంతాపండుగగా జరుపుకోనే వరాన్ని శ్రీకృష్ణుని నుండి పొందింది.    అలాగె శ్రీరాముడు విజయదశిమినాడు లంకను జయించి దీపావళినాడు అయొధ్యకు చేరుకొన్నాడు.

జైనమత వ్యవస్తాపకుడైన మహావీరుడు కూడా చతుర్దశి రోజు నిర్యాణం చెందాడు కాబట్టి జైనులుకోడా ఈ పండుగను జరుపుకోంటారు.

31, ఆగస్టు 2024, శనివారం

ద్రాక్షారామం ఆలయం




 ద్రాక్షారామం ఆలయం



ద్రాక్షారామం ఆలయం గురుంచి తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం.
 ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం ప్రధాన దైవం మాణిక్యాంబ సమేత భీమ్మేశ్వర స్వామి.ఇక్కడి మాణిక్యాంబ అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తి పీటాలలొ ఒకటి.  ఈ ఆలయం కోనసీమ జిల్లాలో వుంది.

ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్రాక్షారామం పేరు దక్ష ప్రజాపతి నుండి వచ్చింది.



పురాణాలప్రకారం ఇక్కడే సతీదేవి తన ఆత్మాహుతి చేసుకుంది.  ఈ ఆలయం శివలింగం 14 అడుగుల ఎత్తులో ఉండే స్పటిక లింగం. ఈ శివలింగాన్ని రెండుఆంతస్తులలో దర్శించుకోవాలి. ఆలయ గోడలపై800 పైగా శాసనాలు ఉన్నాయి

ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు దశరా  ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

 

ద్రాక్షారామం చేరుకోవడం ఎలాగో చూద్దాం.

ద్రాక్షారామం ఆలయం రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడింది. రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు, కాకినాడ నుండి28 కిలోమీటర్లు, రామచంద్రపురం నుండి 6 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ మార్గాల్లో బస్సులు నిత్యం నడుస్తాయి.

రైలు మార్గం ద్వారా: ద్రాక్షారామం చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్లు కాకినాడ,  రాజమండ్రి మరియు సామలకోట జంక్షన్ ఉన్నాయి.

విమాన మార్గం ద్వారా: ద్రాక్షారామం చేరుకోవడానికి సమీప విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం, ఇది ఆలయం నుండి 50 కిలోమీటర్లు దూరంలో ఉంది.

6, ఆగస్టు 2024, మంగళవారం

ఎవరే ..ఎవరే ఎవరే . వస్తోంది నాన్న దగ్గరకి..

Evare Vachindi Naanna daggarake Song Writer, Composer & Singer Vissapragada Raja Ramana 

and all rights reserved for original content creator Vissapragada Raja Ramana
అమ్మమ్మ ఆశల అందాల కూన
తాతయ్య గారాల సిరిమల్లె జాణ
నానమ్మ ఊసుల ఓ చిన్నదాన
ఎవరే ...ఎవరే ...ఎవరే వస్తోంది నాన్న దగ్గరకి
ఏమేం తెస్తోంది నాన్నకిచ్చెందుకి

బువ్వ తినమంటే బుజ్జగించకుంటే బుగ్గల్లోనే బువ్వే కరగనంటోందే..
ఆము తినకుంటే అమ్మ తిట్టుకొంటే ఆడుకొనే ఆటే ఆగనంటోందే..
ఎంత కష్టం వచ్చిందే నీకు .. అమ్మ ముద్దలు ఆపే వరకు
అన్నం అంటేనే ఆటల కరువు .. నీ చిత్రాలు అన్నీ నేరాలు  అంటూ అమ్మ చెబుతూ ఉంటే...

ఎవరే ..ఎవరే ఎవరే . వస్తోంది నాన్న దగ్గరకి..
ఏమేం తెస్తోంది నాన్నకిచ్చెందుకి.

పెద్దత్త ఆశల అందాల కూన
చిన్నత్త గారాల సిరిమల్లె జాణ
మామయ్య ఊసుల ఓ చిన్నదాన
ఎవరే ఎవరే ఎవరే వస్తోంది నాన్న దగ్గరకి ..
ఏమేం తెస్తోంది నాన్నకిచ్చెందుకి

నిద్రపోదామంటే అమ్మ కానకుంటే తిక్క పెడుతుంటే ఆపేదెవ్వరటే
లాల పోసుకొటే సబ్బు రుద్దుకొంటే..బొబ్బ లోని ఆటే నేర్పేదెవ్వరటే..
నాన్న అంటేనే ఆటల కోటే.. నాన్న అంటేనే ఓ పెద్ద ఆటే నాన్న తోడుంటే నీకు ఆటంటే ఆటే పాడింది పాటే..

కనుకే కనుకే .. కనుకే వచ్చేయవే నాన్న దగ్గరకి
ఆటలాడు కొందాం ఎప్పటికప్పటికి...

3, ఆగస్టు 2024, శనివారం

గరుడ పక్షి ప్రత్యేత

గరుడ పక్షి ప్రత్యేత 

గరుడ పక్షి  దీన్నే వాడుక భాషలో గ్రద్ద అనికూడా అంటారు. గరుడపక్షికిఒక విచిత్రమైన ప్రత్యేకలక్షణం ఉంది దానిగురించిఈ వీడియోలోతెలుసుకుందాం.   గరుడ పక్షిగురించిమనపురాణాగ్రంధాలలొ చాలాప్రస్తావనలుఉన్నాయి.

కశ్యపప్రజాపతి వరంతో వినతకుజన్మించిన అతిశక్తివంతమైనగరుత్మంతుడు తన తల్లిఅయిన వినతయొక్క దాస్యం విముక్తిచేయడంకొరకు దేవేంద్రునిజయించి అమృతాన్నితీసుకువచ్చేకథ మనం మహాభారతం లో


చూస్తాం. క్రమంలో గరుత్మంతుడు విష్ణుమూర్తి నుండి ఆయనకివాహనంగాను, జెండాగాను ఉండే వరంపొందుతాడు.

తిరుమల శ్రీవారిబ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అత్యంత ప్రాముఖ్యతసంతరించుకుంది. గరుడ వాహనసేవరోజు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలోవస్తారు. అలాగే ఇండోనేషియాలో గరుడ ఎయిర్ లైన్స్ పేరుతో ఒక విమానయాన సంస్థ కూడాఉంది. అమెరికాదేశపు రాజముద్రలోకూడా గరుడపక్షిఉంటుంది. దేవతలను అనిమిషులు అని అంటారు. అంటే అర్ధం కనురెప్ప వాల్చరు,

అలాగే  గరుడుపక్షి కూడాతన కళ్ళను కనురెప్పలతోమూయదు. గరుడపక్షికి ఒక ప్రత్యేకమైనలక్షణంఉందనుకున్నాంకదా అదేంటో ఇప్పుడుచూద్దాం. దీనికి అత్యంతశక్తివంతమైనచూపుఉంటుంది. ఇది మూడు మైళ్ళదూరంవరకు చూడగలదు. గరుడపక్షికి కళ్ళనుమూయడానికిఒక

ప్రత్యేకమైనఏర్పాటు ఉంటుంది. ఒకవిధమైన పల్చటిచర్మపుపొరలు ప్రక్కల నుండి కళ్ళనుమూస్తాయి

21, జులై 2021, బుధవారం

 ఏతీరుగ నను దయచూచెదవో?




పల్లవి:


ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ..

 
చరణము(లు):


శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా..


క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా
దారీద్రము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ..



వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ..
వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ..