2, అక్టోబర్ 2024, బుధవారం

దీపావళి పండుగ పరమార్ధం

 

దీపావళి పండుగ పరమార్ధం

మన దేశంలో అనాదిగా ఆ సేతుహిమాచలం పెద్దలూ పిల్లలూ అనందోత్సాహాలతో జరుపుకొనేపండుగ దీపావళి. చీకటి లోనుండి వెలుగులోనికి, అగ్నానమునుండి గ్నానము వైపు మన జీవన ప్రయాణపు గమ్యం ఉండాలనేదే దీపావళి పండుగ పరమార్ధం.

దీపావళి అంటే దీపముల వరుస అని అర్దం.

దీపావళి పండుగను పూర్వం అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీకశుద్ద విదియవరకు ఐదురోజులు జరుపుకొనేవారు. ఇప్పటికీ ఉత్తరభారతదేశంలో ఐదు రోజులుగా, దక్షిణభారతదేశం లో మూడురోజులుగా జరుపుకొంటున్నాము

త్రయోదశి నాడు రాత్రి అపమృత్యు నివారణకోసం దీపాలువెలిగించి ఇంటిముందు ఉంచాలి. చతుర్దశి రోజున నూనెయందు లక్ష్మి , నీటియందు గంగాఉంటాయి కాబట్టి వంటికినూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి అనంతరం నూతన వస్త్రధారణ చెయాలి. ఇక అమావాస్య రోజు వివిధ రకాలపిండి వంటలూ, మిఠాయిలూ, పంచభక్ష్య పరమాణ్ణాలతోభుజించి సాయంత్రంలక్ష్మీపూజచేసి ఇంటిని దీపాలతో అలంకరించాలి. తరువాత టపాకాయలు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లుతోవచ్చే సందడి వాతావరణం అందరికి తెలిసిందే.

దీపావళి ఇతిహాసం

పురాణ గాధ ప్రకారం వరాహవతారంలొ విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినవాడు నరకాసురుడు. ఈ నరకాశురుడు బ్రహ్మవలన వరాలు పొంది దేవ మానవులను పీడించేవాడు. ఇతని బాధలు తాళలేక ఇంద్రుడు కృష్ణునికి మొరపెట్టుకోంటే సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసురిని సంహరించిన రోజే నరకచతుర్ధి గా మనం జరుపుకొంటున్నాము. భూదేవి నరకుడు తన కొడుకైనప్పటికి అతని మరణంవల్ల లోకకళ్యాణం జరిగినందుకు సంతోషించి నరకుడు మరణించినరొజును నరక చతుర్దశిగా మానవులంతాపండుగగా జరుపుకోనే వరాన్ని శ్రీకృష్ణుని నుండి పొందింది.    అలాగె శ్రీరాముడు విజయదశిమినాడు లంకను జయించి దీపావళినాడు అయొధ్యకు చేరుకొన్నాడు.

జైనమత వ్యవస్తాపకుడైన మహావీరుడు కూడా చతుర్దశి రోజు నిర్యాణం చెందాడు కాబట్టి జైనులుకోడా ఈ పండుగను జరుపుకోంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి