17, జులై 2021, శనివారం

ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా?

 



పంతువరాళి - రూపక
పల్లవి:
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ..
అను పల్లవి:
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?
కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ..
చరణము(లు):
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా
ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ..
శాపకారణము నహల్య చాపరాతి చందమాయె
పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే
రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..

14, జనవరి 2017, శనివారం

నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ




 మోహనరాగం -త్యాగరాజ కృతి 

నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ ॥న॥
అను పల్లవి:
వనజనయన మోమును జూచుట జీ
వనమని నెనరున మనసు మర్మము దెలిసి ॥న॥
చరణము(లు):
సురపతి నీలమణినిభ తనువుతో
నురమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత ॥న॥